‘మజిలీ’ సినిమా తొలివారం వసూళ్లు

0
63

  • విభిన్నమైన ప్రేమకథగా ‘మజిలీ’
  • తొలివారంలో 45.6 కోట్ల గ్రాస్
  • చైతూకి దక్కిన మరో హిట్

నాగచైతన్య తాజా చిత్రంగా ఈ నెల 5వ తేదీన ‘మజిలీ’ థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ కావడంతో, ఈ రెండు వర్గాల ప్రేక్షకులకు ఈ కథ కనెక్ట్ అయింది. దాంతో విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తొలివారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 45.6 కోట్ల గ్రాస్ .. 27.85 కోట్ల షేర్ ను సాధించింది. ఇక ఈ సినిమా నైజామ్ లో 10 కోట్ల షేర్ మార్కును అందుకోనుండటం విశేషం. చైతూ కెరియర్లోనే తొలివారంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. దివ్యాన్ష కౌశిక్ కి లవర్ గా .. సమంతకి భర్తగా చైతూ చాలా బాగా చేశాడని అంటున్నారు. నటన పరంగా ఆయన చాలా పరిణతిని కనబరిచాడని చెబుతున్నారు. మొత్తానికి చైతూ సమంతతో కలిసి మరో హిట్ కొట్టేశాడన్న మాట.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here