రాజమౌళి సినిమాకి అలియా భట్ పారితోషికం 5 కోట్లు

0
79

  • బాలీవుడ్లో అలియాకి భారీ క్రేజ్
  • రాజమౌళి సినిమాలో చరణ్ జోడీగా
  •  త్వరలోనే షూటింగుకు హాజరు

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉండటం వలన, ఆయా భాషలకి చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్ సరసన నాయికగా అలియా భట్ ను తీసుకున్నారు. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది.

ఈ సినిమా కోసం ఆమెకి అందే పారితోషికం ఎంతనే విషయంలో అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. అక్షరాలా ఆమెకి ముట్టజెప్పే పారితోషికం 5 కోట్లు అని తెలుస్తోంది. అలియా భట్ కి సంబంధించిన టీమ్ ఖర్చులు .. స్టార్ హోటల్లో బస ఖర్చులు .. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కాకుండా ఆమె పారితోషికాన్ని 5 కోట్లుగా ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్స్ 3 సినిమాలకి కలిపి అందుకునే పారితోషికం ఇది .. అలియా భట్ కి గల క్రేజ్ అలాంటిది మరి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here