24 గంటల్లో 4 మిలియన్ వ్యూస్ ను రాబట్టిన ‘జెర్సీ’ ట్రైలర్

0
82

  • కెటర్ గా కనిపించనున్న నాని
  • ప్రేమ .. పట్టుదల నేపథ్యంలో సాగే కథ
  •  ఈ నెల 19వ తేదీన విడుదల

తెరపై నాని ఇంతవరకూ క్రికెటర్ గా కనిపించలేదు. అలా ఆయనను తెరపైకి తీసుకొచ్చిన చిత్రమే ‘జెర్సీ’.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాని సరసన నాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రేమ .. ఆశయం .. నిరాశలో ఉన్నప్పుడు నిరాదరణ .. పట్టుదలతో సాధించిన విజయం .. ఇలా రకరకాల కోణాలను టచ్ చేసే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య .. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్స్ ట్రైలర్ కి మంచి మార్కులు పడేలా చేశాయి. ఈ కారణంగానే ఈ ట్రైలర్ ను వదిలిన 24 గంటల్లోనే 4 మిలియన్లకి  పైగా వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలను పెంచడంలో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here