ఏపీ సీఎం చంద్రబాబు!: నేను పోరాడుతున్నది అందుకే

0
41

  • కనీసం 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలి
  • ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్నా
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత

సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో పోలైన ఓట్లను కనీసం 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులతో సరిపోల్చి చూడాలని తనతో పాటు విపక్ష పార్టీల నేతలందరూ డిమాండ్ చేస్తున్నారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తాను దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు.

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందని పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ మాత్రమే వాడుతున్నారని గుర్తుచేశారు. చాలాదేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here