‘గల్లీబాయ్’ తెలుగు రీమేక్ గురించి మెగా హీరో

0
42

  • హిందీలో హిట్ కొట్టిన ‘గల్లీబాయ్’
  • తెలుగులో రీమేక్ అంటూ వార్తలు
  •  తాను చేయడం లేదన్న తేజు

ఇటీవల హిందీలో సందడి చేసిన సినిమాల్లో ‘గల్లీబాయ్’ ఒకటి. రణ్ వీర్ సింగ్ .. అలియా భట్ జంటగా జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాను విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సన్నిహితులు ఖండించారు. అప్పటి నుంచి ఈ రీమేక్ లో సాయిధరమ్ తేజ్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

సక్సెస్ కోసం చాలా కాలంగా చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న తేజు, ఆల్రెడీ హిట్ కొట్టిన ‘గల్లీబాయ్’ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై తేజు స్పందిస్తూ .. “అసలు ఇంతవరకూ నేను ‘గల్లీబాయ్’  సినిమానే చూడలేదు. అలాంటిది ఈ సినిమా రీమేక్ లో ఎలా చేస్తాను? .. ఇదంతా కేవలం పుకారు మాత్రమే” అని చెప్పుకొచ్చాడు. దాంతో తేజు కూడా ఈ సినిమా రీమేక్ లో చేయడం లేదనే విషయంలో స్పష్టత వచ్చింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here