చంద్రబాబు పీఎస్ బెదిరింపులు.. పంజాగుట్ట పోలీసులకు విజయవాడ వ్యాపారి ఫిర్యాదు!

0
54

  • రూ.8 కోట్ల పార్టీ ఫండ్ ఇవ్వాలని శ్రీనివాస్ బెదిరిస్తున్నాడు
  • ఇవ్వకుంటే అంతు చూస్తామని హెచ్చరించాడు
  • సీఎం ఇంటి నంబర్ నుంచి కూడా కాల్ చేశాడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ తో పాటు దొరబాబు అనే వ్యక్తి తనను పార్టీ ఫండ్ కోసం తనను బెదిరిస్తున్నారని విజయవాడకు చెందిన వ్యాపారి రవికాంత్ ఆరోపించారు. ఈరోజు 10 గంటల్లోగా రూ.8 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందిగా తనపై ఒత్తిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒకవేళ నగదు ఇవ్వకుంటే అంతు చూస్తామని వీరిద్దరూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ కాల్స్ ద్వారా వీరిద్దరూ తనను గత కొద్దిరోజులుగా మానసిక హింసకు గురిచేస్తూ వేధిస్తున్నారని చెప్పారు.

కేవలం వాట్సాప్ నుంచే కాకుండా సీఎం చంద్రబాబు ఇంట్లోని అధికారిక నంబర్ నుంచి కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని రవికాంత్ ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యవహారంపై ఏపీ, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశానని రవికాంత్ చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here