ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో రతన్ టాటా

0
69

  • ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో సమావేశం
  • ఈ నెల 17న నాగ్ పూర్ లో భేటీ
  • రెండు గంటల పాటు కొనసాగిన సమావేశం

ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ తో టాటా సంస్థల అధినేత రతన్ టాటా భేటీ అయ్యారు. ఈ నెల 17న నాగ్ పూర్ లో వీరి భేటీ జరిగినట్టు సమాచారం. రెండు గంటల సేపు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో రతన్ టాటా ఉన్నారు. ఈ సమావేశానికి గల కారణాలు స్పష్టంగా బయటకు రానప్పటికీ… ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని ఆరెస్సెస్ ప్రతినిధులు తెలిపారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని రతన్ టాటా సందర్శించడం ఇది రెండో సారి. 2016 డిసెంబర్ లో ఆయన తొలిసారి అక్కడకు వెళ్లారు. భగవత్ తో భేటీ ముగిసిన వెంటనే ముంబైకి రతన్ టాటా వెళ్లిపోయారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here