‘కార్తికేయ 2’ పెళ్లి తరువాత కలర్స్ స్వాతి తొలి సినిమాగా

0
130

  • గతంలో వచ్చిన ‘కార్తికేయ’ హిట్
  • సీక్వెల్ కోసం రంగంలోకి
  • చందూ మొండేటి కొత్త కథానాయిక పరిచయం

నిఖిల్ – ‘కలర్స్’ స్వాతి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రమణ్య స్వామి ఆలయం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో చందూ మొండేటి వున్నాడు. నిఖిల్ హీరోగా ‘కార్తికేయ 2’ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇందులో ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారట. ఒక కథానాయిక కొత్త అమ్మాయి అయితే, మరో కథానాయిక ‘కలర్స్’ స్వాతి. అయితే కొంతకాలం క్రితమే స్వాతికి పెళ్లైపోయింది. అందువలన ఆమె సినిమాలు చేయదనే అంతా అనుకున్నారు. కానీ ‘కార్తికేయ 2’ లో చేయడానికి ఆమె అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మొదటిభాగంలోని పాత్రకి కొనసాగింపుగానే రెండవభాగంలోని పాత్ర ఉంటుందట. అందువల్లనే ఆమె అంగీకరించినట్టు చెబుతున్నారు. పెళ్లి తరువాత ఆమె చేయనున్న సినిమా ఇదే అవుతుంది. ఇకపై కూడా ఆమె సినిమాలు చేస్తుందేమో చూడాలి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here