మోదీని ఓడించడానికి ముస్లిం, క్రిస్టియన్ దేశాల కుట్ర.. కోట్లు పంపిస్తున్నారు!: బాబా రాందేవ్

0
73

  • మోదీ చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది
  • ఆయన 24 గంటలు దేశం కోసమే పనిచేస్తున్నారు
  • రాజస్థాన్ లోని జైపూర్ లో ఎన్నికల ప్రచారం

ప్రముఖ యోగా గురువు, పతంజలి ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్ బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ముస్లిం, క్రైస్తవ దేశాలు కుట్రలు పన్నుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయని ఆరోపించారు. మోదీ చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాందేవ్ మాట్లాడారు.

ప్రధాని మోదీ దేశ సంక్షేమం కోసం పాటుపడుతున్నారని రాందేవ్ వ్యాఖ్యానించారు. ‘దేశ అభివృద్ధి కోసం మోదీ 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. ఎలాంటి స్వప్రయోజనాల కోసం పని చేయలేదు. ఆయనకు కుటుంబం లేదు. సొంత ఇల్లు లేదు. అలాంటి మోదీకి మనమంతా మద్దతుగా నిలవాలి. ఆయన చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది. ఆయన పాలనలోనే సైనికులు, మహిళలు, రైతులు అందరికి రక్షణ, భరోసా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here