సిక్సర్ కొట్టేసిన ‘జెర్సీ’… నానీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అట!

0
58

  • ఈ ఉదయం విడుదలైన ‘జెర్సీ’
  • సినిమా చాలా బాగుందని ట్విట్టర్ లో పోస్టులు
  • సెంటిమెంట్ చక్కగా పండిందని కితాబు

ఈ ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నాని తాజా చిత్రం ‘జెర్సీ’ సూపర్ హిట్టని ఫ్యాన్స్ ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తున్నారు. సినీ మైదానంలో ఈ చిత్రం సిక్సర్ కొట్టిందని అంటున్నారు. నాని తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని, స్క్రీన్ ప్లే, బీజీఎం అద్భుతమని అంటున్నారు. కొన్ని రివ్యూ వెబ్ సైట్లు ఈ సినిమాకు 4 నుంచి 4.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

ఇక సినిమాలో సెంటిమెంట్ సీన్లు చక్కగా పండాయని, కేవలం రూ. 500 పెట్టి, తన కుమారుడికి ఓ జెర్సీని కొనిచ్చేందుకు తండ్రిగా నాని పడ్డ తపన అద్భుతమని కితాబిస్తున్నారు. క్లయిమాక్స్ మరింతగా బాగుందని అంటున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here