విజయసాయిరెడ్డి స్వయంగా నాకు ఫోన్ చేశారు.. వైసీపీలోకి చేరాలని ఆహ్వానించారు!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

0
50

  • గతంలో జరిగిందేదో జరిగిపోయింది
  • మీరు వృత్తిపరంగానే పనిచేశారు
  • కలసి పనిచేద్దాం రమ్మని ఆహ్వానించారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు ఆహ్వానం వచ్చిందని సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. వైసీపీ లో చేరాలని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి తనను స్వయంగా ఆహ్వానించారని చెప్పారు.

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..‘నాకు విజయసాయిరెడ్డి ఫోన్ చేసి అది(జగన్ అరెస్ట్) మీరు వృత్తిపరంగా చేశారు. రాజకీయాలు వేరే. మేం కూడా ప్రజల కోసం మంచి పనులు చేయాలనుకుంటున్నాం. అందుకే జగన్ పాదయాత్ర కూడా చేశారు.

కాబట్టి గతంలో జరిగింది పక్కన పెట్టేసి మీరు కూడా ప్రజల కోసం ఇందులో భాగస్వామి అయితే బాగుంటుందని చెప్పారు’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో వేర్వేరు పార్టీల నుంచి ఆహ్వానం రావడం అన్నది సాధారణమేనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక రకరకాల ఆలోచనలతో ఉన్న పార్టీలు సంప్రదిస్తాయనీ, కానీ తన ఆలోచనతో ఉన్నవారితోనే కలిసి పనిచేస్తానని గతంలోనే స్పష్టం చేశానని గుర్తుచేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here