వరల్డ్ కప్ సెమీస్ కు పాకిస్థాన్… గంగూలీ అంచనా!

0
62

  • ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా
  • ప్రతి మ్యాచ్ కీలకమే
  • పీటీఐ ఇంటర్వ్యూలో సౌరవ్

వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో సెమీఫైనల్స్ కు పాకిస్థాన్ చేరే అవకాశాలున్నాయని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంచనా వేశారు. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు సెమీస్ కు చేరుతాయని భావిస్తున్నానని, ఈ జట్లలో ఒకరికి కప్ దక్కుతుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన పోటీలతో పోలిస్తే, ఈ సారి మరింత కఠినంగా పోరు సాగుతుందని వ్యాఖ్యానించిన ఆయన, భారత జట్టు అన్ని రంగాల్లోనూ బలంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. సులభంగా భావించే జట్లేవీ లేవని, ఏ జట్టుపైన అయినా విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని అన్నారు. కాగా, ఈ దఫా వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో సాగనుందన్న సంగతి తెలిసిందే. ప్రతి జట్టూ మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టాప్ 4 స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్ కు చేరుతాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here