డియర్ కామ్రేడ్’ ఆలస్యానికి అదే కారణమట

0
124

  • ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడిగా భరత్ కమ్మ
  • రీ షూట్ కారణంగా ఆలస్యం
  •  మే 31వ తేదీన సినిమా విడుదల

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఆయన తాజా చిత్రంగా రానున్న ‘డియర్ కామ్రేడ్’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా .. క్రికెటర్ గా రష్మిక కనిపించనుంది.

ఈ సినిమా షూటింగ్ కాకినాడ .. తుని ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది. ఈ సినిమా రష్ చూసిన విజయ్ దేవరకొండ అసంతృప్తికి లోనయ్యాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కొన్ని సీన్స్ రీ షూట్ చేయమని విజయ్ దేవరకొండ నిర్మాతలను కోరడం .. వాళ్లు చేయించడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చిందని చెబుతున్నారు. మే 31వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here