వెరైటీగా నాని తదుపరి సినిమా టైటిల్

0
82

  • ‘జెర్సీ’తో హిట్ కొట్టిన నాని
  • తదుపరి సినిమా ఇంద్రగంటితో
  • టైటిల్ గా ‘వి’ ఖరారు

నాని కథానాయకుడిగా విడుదలైన ‘జెర్సీ’ సినిమా సాధారణ ప్రేక్షకుల మనసులతో పాటు, ప్రముఖుల హృదయాలను సైతం దోచేసుకుంది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో నాని మాంఛి ఉత్సాహంగా వున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమాకి ‘వ్యూహం’ అనే టైటిల్ ను పరిశిలీస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి ‘వి’ అనే టైటిల్ ను ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది. ‘వి’ అనే అక్షరానికి కథకి ఎలాంటి సంబంధముందనేది ఆసక్తిని కలిగించే విషయం. ఈ నెల 29వ తేదీన టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ రోజునే కథానాయికలకు సంబంధించిన విషయంలోను స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here