వైసీపీపై బెట్టింగ్ పెట్టిన వాళ్లంతా డబ్బులు తిరిగి ఇవ్వమని ప్రాధేయపడుతున్నారు: దేవినేని ఉమ

0
161

  • తిరిగి టీడీపీ గెలుపుపై బెట్టింగ్ లు కాస్తున్నారు
  • ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం
  • కోడికత్తి దొంగలను నమ్ముకుంటే నష్టపోతారు

వైసీపీపై బెట్టింగ్ పెట్టిన వాళ్లంతా డబ్బులు తిరిగి ఇవ్వమని ప్రాధేయపడుతున్నారని, తిరిగి టీడీపీ గెలుపుపై బెట్టింగ్ లు కాస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ సెటైర్లు విసిరారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

‘కోడికత్తి దొంగలను నమ్ముకుంటే నష్టపోతారు’ అంటూ వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. ఒకప్పుడు పోలీసులను చూసి దొంగలు పారిపోయేవారని, ఇప్పుడు దొంగలు ఫిర్యాదు చేస్తే పోలీసులు పారిపోతున్నారని, అధికారులను బెదిరించే విధంగా ప్రతిపక్ష నేతల తీరు ఉందని విమర్శించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here