ఇది నీతిమాలిన చర్య కాదా చంద్రబాబూ?: విజయసాయి రెడ్డి

0
121

  • గ్రంథాలయ సంస్థ చైర్మన్ వేతనాన్ని పెంచిన ప్రభుత్వం
  • రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంపు
  • ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ వేతనాన్ని రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచడంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “అపద్ధర్మ సిఎంగా ఉంటూ రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ దాసరి రాజా జీతభత్యాలను రూ.50 వేల నుంచి రెండు లక్షల పెంచడం నీతి మాలిన చర్య కాదా చంద్రబాబూ? ఏప్రిల్19న ఇచ్చిన ఉత్తర్వులో బకాయిలు రూ.24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. మీ హెరిటేజ్ కంపెనీలో అయితే ఇలా 200% పెంచుతారా?” అని ప్రశ్నించారు.

అంతకుముందు, “అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు. టీడిపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఇవిఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో?” అని ఎద్దేవా చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here