ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు మొదలు… విశేషాలివి!

0
80

  • 8, 10 తేదీల్లో ప్లే ఆఫ్ మ్యాచ్ లు
  • విశాఖలో జరగనున్న పోటీలు
  • ‘ఈవెంట్స్ నౌ’ ద్వారా టికెట్ల అమ్మకాలు

ఈ నెల 8, 10 తేదీల్లో విశాఖపట్నంలోని ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్ ల కోసం స్టేడియం సిద్ధం కాగా, ఫణి తుపాను ప్రభావం కొన్ని పనులకు ఆటంకాలు కల్పించినట్టు తెలుస్తోంది. ఇక ఆన్ లైన్ లో ‘ఈవెంట్స్ నౌ’ వెబ్ సైట్ ద్వారా టికెట్ల అమ్మకాలు ప్రారంభించామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.

ఈ మ్యాచ్ కి రూ. 500, రూ.1000, రూ.1500, రూ.1750, రూ.3500, రూ.7500గా టికెట్ల రేట్లను నిర్ణయించినట్టు ఏసీఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రూ. 7,500 టికెట్ తో స్టేడియం ఆతిథ్యాన్ని పొందవచ్చని అన్నారు. కార్పొరేట్‌ బాక్స్ కు సంబంధించి రూ. 9000 (ఆతిథ్యం), రూ.5000గా ధరను నిర్ణయించామన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here