విమానం ల్యాండింగ్‌లో ప్రమాదం.. 41 మంది దుర్మరణం

0
104

  • టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం
  • అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన పైలట్లు
  • నేలను బలంగా ఢీకొని మంటలు

రష్యాలోని మాస్కోలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే  విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌కు పైలట్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.

ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలుపుకుని 78 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో 41 మంది సజీవ దహనమయ్యారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వీరిలో ఆరుగురు గాయపడ్డారని అధికారులు వివరించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here