శోభన్ బాబుగారితో హీరోయిన్స్ తమ ఫ్యామిలీ విషయాలు చెప్పుకునేవారు: జయసుధ

0
79

  • శోభన్ బాబు గారు చాలా సరదా మనిషి
  •  కృష్ణంరాజు గారు కాస్త రిజర్వ్డ్ గా వుంటారు
  • ఇద్దరితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ నేనే

తెలుగు తెరపై సహజనటిగా జయసుధకు ఎంతో మంచి పేరు వుంది. ఆనాటి అగ్రకథానాయకులందరితోను ఆమె నటించారు. ముఖ్యంగా శోభన్ బాబు .. కృష్ణంరాజు గార్లతో ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయికగా కూడా ఆమెకి ఒక రికార్డు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. ” సెట్లో శోభన్ బాబుగారు అడుగుపెట్టడంతోనే సందడి మొదలవుతుంది. అందరితోనూ ఆయన చాలా కలుపుగోలుగా వుంటారు.

అందరికీ చాక్ లెట్స్ ఇవ్వడం ఆయనకి ఇష్టం. హీరోయిన్స్ అందరినీ సరదాగా ఆయన ఆటపట్టించేవారు. హీరోయిన్స్ అంతా కూడా ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా భావించి, తమకి సంబంధించిన విషయాలు చెప్పుకుని గైడెన్స్ తీసుకునేవారు. ఇక కృష్ణంరాజుగారి విషయానికొస్తే, ఆయన కాస్త రిజర్వ్డ్ గానే ఉండేవారు. అలాగని అంటీముట్టనట్టుగా ఉండేవారు కాదు. అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన సొంత బ్యానర్లో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ నేనే. ఇద్దరం పోటీపడి నటించేవాళ్లం” అని చెప్పుకొచ్చారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here