కన్నడ స్టార్ హీరోకి విలన్ గా జగపతిబాబు

0
104

  • ‘లెజెండ్’తో విలన్ గా మారిన జగపతిబాబు
  •  తమిళ .. మలయాళ భాషల్లోను సినిమాలు
  • కన్నడ సినిమాలపై ప్రత్యేక దృష్టి

‘లెజెండ్’ సినిమాతో విలన్ గా టర్న్ తీసుకున్న జగపతిబాబు, ఆ సినిమా నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులోనే కాదు తమిళ మలయాళ భాషల్లోనూ ఆయన ప్రతినాయకుడిగా, కీలకమైన పాత్రధారిగా బిజీ అయ్యారు. జగపతిబాబు పారితోషికం భారీగా పెరిగినా, ఆయనను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. గతంలో ఒకటి రెండు కన్నడ సినిమాల్లో చేసిన ఆయనకి ఈ సారి భారీ ప్రాజెక్టు నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది.

‘దర్శన్’ హీరోగా రూపొందుతోన్న ‘రాబర్ట్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకిగాను జగపతిబాబును తీసుకున్నారు. మొన్ననే ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఇక కన్నడ సినిమాలు కూడా సాధ్యమైనంత ఎక్కువగా చేయాలనే ఆలోచనలో జగపతిబాబు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి జగపతిబాబు ఒక రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here