12న ఎంఎంటీఎస్‌ రైళ్లు తిరగవు…అధికారుల ప్రకటన

0
49

  • బేగంపేట-సనత్‌నగర్‌ స్టేషన్‌ల మధ్య వంతెన పనుల కారణంగా రద్దు
  • ప్రయాణికులు గమనించాలి
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన

హైదరాబాద్‌ నగరంలోని బేగంపేట-సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య చేపడుతున్న వంతెన పనుల కారణంగా ఈనెల 12వ తేదీన ఈ రూటులో తిరిగే పలు ఎంఎంటీసీ రైళ్లు రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ పనుల కారణంగా రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఫలక్‌నుమా-లింగంపల్లి (47149), లింగంపల్లి-ఫలక్‌నుమా (47173), లింగంపల్లి-ఫలక్‌నుమా (47171), ఫలక్‌నుమా-లింగంపల్లి (47151), ఫలక్‌నుమా-లింగంపల్లి (47150), లింగంపల్లి-ఫలక్‌నుమా (47174),  హైదరాబాద్‌-లింగంపల్లి (47100), లింగంపల్లి-హైదరాబాద్‌ (47127), హైదరాబాద్‌-లింగంపల్లి (47101), లింగంపల్లి-హైదరాబాద్‌ (47128), లింగంపల్లి-హైదరాబాద్‌ (47129), హైదరాబాద్‌-లింగంపల్లి (47105),  ఫలక్‌నుమా-లింగంపల్లి (47153), లింగంపల్లి-ఫలక్‌నుమా (47176) రైళ్లు రద్దు చెసినట్టు పేర్కొన్నారు. విషయాన్ని గమనించి అత్యవసర ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here