బర్రెలు కాసే నేను నానీతో కలిసి నటిస్తానని అనుకోలేదు: ‘జబర్దస్త్’ కొమరం

0
51

  • నేను చదివింది పదో తరగతే
  • హోటల్లో ప్లేట్లు కడిగాను
  • నాని ఒక ఫ్రెండులా చూసుకున్నాడు

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన నటుల్లో ‘కొమరం’ ఒకరు. ‘పశువులంటే నాకు పాణం .. ‘ అంటూ తెలంగాణ యాసలో చేసిన ఒక యాడ్ కి సంబంధించిన అనుకరణ ఆయననకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చాడు.

“నేను పదో తరగతి వరకే చదివాను .. మా ఊళ్లోనే పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడిని. నేను మిమిక్రీ చేస్తుండటంతో, మా ఊళ్లోవాళ్లంతా సినిమాల్లో ట్రై చేయరా అని చెప్పారు. దాంతో హైదరాబాద్ వచ్చిన నేను, ఫుడ్డుకి .. బెడ్డుకి సమస్య ఉండదనే ఉద్దేశంతో ఒక హోటల్లో చేరాను. హోటల్లో ప్లేట్లు కడిగే నేను ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. ఇక బర్రెలు కాసుకునే నేను నానీతో కలిసి ‘జెర్సీ’ సినిమాలో నటిస్తానని ఎంతమాత్రం అనుకోలేదు. నానీ నన్ను ఒక ఫ్రెండులా చూసుకున్నాడు. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం” అని చెప్పుకొచ్చాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here