వారు, మేము అంతేనా?… ముంబై విజయంపై ధోనీ స్పందనిది!

0
66

  • 12 ఐపీఎల్ సీజన్లలో 7 సార్లు గెలిచిన ముంబై, చెన్నై జట్లు
  • కప్ మా రెండు టీమ్ ల మధ్యే తిరుగుతోంది
  • ఇంకాస్త బాగా ఆడుండాల్సిందన్న ధోనీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటివరకూ 12 సార్లు జరుగగా, హ్యాట్రిక్ విజేతలుగా, మూడేసి మార్లు కప్పులను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు 12వ సీజన్ ఫైనల్ లో తలపడగా, ఉత్కంఠ పోరులో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా నాలుగు సార్లు కప్ ను గెలుచుకున్న జట్టుగా ముంబై నిలిచింది.

ఈ 12 సంవత్సరాల్లో 7 సంవత్సరాల పాటు ముంబై, చెన్నై జట్టే కప్పును పంచుకున్నాయి. ఇక నిన్నటి మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ ట్రోఫీ ముంబై, చెన్నై జట్ల మధ్య అటూ ఇటూ తిరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ లో ముంబై, చెన్నైలు మాత్రమే కనిపిస్తున్నాయని, తమకన్నా ముంబై ఒక్క పరుగు ముందు నిలిచి ట్రోఫీని గెలిచిందని, ఈ ఓటమితో బాధపడకుండా, తదుపరి సీజన్ పై దృష్టిని సారిస్తామని అన్నాడు. ఇంకాస్త బాగా ఆడుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here