కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పై మండిపడ్డ బీజేపీ నేత జీవీఎల్!

0
41

  • మోదీ మలినమైన నోరున్న ప్రధాని అన్న అయ్యర్
  • అయ్యర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన జీవీఎల్
  • గతంలో చేసిన నీచ్ వ్యాఖ్యల ప్రస్తావన

ప్రధాని మోదీని అత్యంత మలినమైన నోరున్న ప్రధాని అని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్  అనడంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. 2017లో ప్రధాని మోదీని నీచుడు అన్న అయ్యర్ అప్పుడు తనకు హిందీ సరిగ్గా రాదన్న కారణంతో తప్పించుకున్నారని విమర్శించారు.

ఆ వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆయనపై ఏడాది నిషేధం విధించిందనీ, ఆ తర్వాత ఎత్తివేసిందని వ్యాఖ్యానించారు. నీచ్ వ్యాఖ్యలపై అయ్యర్ అప్పట్లో క్షమాపణలు కూడా చెప్పారన్నారు.

తాజాగా ఇప్పుడు ‘మే 23 తర్వాత అత్యంత మలినమైన నోరున్న ప్రధానిని దేశం సాగనంపుతుంది. ఆయనకు భారత్ ఇచ్చే గట్టి జవాబు ఇదే’ అని అయ్యర్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు, పొగరుబోతుతనం, గర్వానికి ఇదే ఉదాహరణ అని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన జీవీఎల్, అయ్యర్ వ్యాఖ్యలకు సంబంధించి ఓ క్లిప్ ను ట్వీట్ కు జతచేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here