నేను హీరోయిన్ గా పనికిరానని చెప్పేసి, కేవీ రెడ్డిగారు నన్ను ఇంటికి వెళ్లిపొమ్మన్నారు: ‘షావుకారు’ జానకి

0
68

  • నేను హైట్ లేను అని అన్నారు
  •  గ్లామర్ లేదని ముఖాన్నే చెప్పారు
  •  మంచి పర్సనాలిటీ లేదన్నారు

‘షావుకారు’ సినిమాతో తెలుగు తెరకి జానకి పరిచయమయ్యారు. దాంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తరువాత ఆనాటి అగ్రకథానాయకులతో ఎన్నో సినిమాల్లో నటించారు .. ఎన్నో విజయాలను అందుకున్నారు.

అలాంటి ‘షావుకారు’ జానకి తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ .. ‘షావుకారు’ తరువాత నా మనసుకు బాధ కలిగించే సంఘటన ఒకటి జరిగింది. ఒకసారి దర్శకుడు కేవీ రెడ్డిగారు ‘ఏయ్ అమ్మాయి ఏవూరు మీది?’ అని అడిగారు. ‘రాజమండ్రి అండీ’ అన్నాను. ‘వెళ్లిపో రాజమండ్రికి .. మరీ ఇంతే వున్నావ్ .. అయిదు పూల రాణిలాగా .. గ్లామర్ లేదు ఏమీలేదు .. మంచి పర్సనాలిటీ లేదు .. మా హీరోల పక్కన నువ్వు మరీ ఇంతే కనిపిస్తున్నావు .. నువ్వు హీరోయిన్ గా పనికి రావు గానీ .. వెళ్లు” అన్నారు. ‘ఈ పరిశ్రమను నమ్ముకుని ఒక పాపాయితో వచ్చానండీ .. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోను .. నా కుటుంబాన్ని పోషించుకోవలసిన బాధ్యత నాపై వుంది’ అన్నాను. అప్పటి నుంచి మరింత పట్టుదలగా ముందుకు సాగాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here