ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్… హీరోగా అవతారం ఎత్తనున్న దర్శకుడు వీవీ వినాయక్!

0
47

  • గతంలో ‘ఠాగూర్’లో నటించిన వినాయక్
  • దిల్ రాజు నిర్మాతగా హీరోగా పరిచయం కానున్న దర్శకుడు
  • దర్శకత్వం వహించనున్న నరసింహారావు

ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా అవతారం ఎత్తనున్నారు. అభిమానులకు ఎంతో సర్ ప్రయిజ్ కలిగించిన ఈ వార్త త్వరలోనే నిజం కాబోతోంది. అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’లో ఓ గుర్తుండిపోయే పాత్రను ధరించిన వినాయక్, ఇప్పుడు సోలో హీరోగా పరిచయం కాబోతుండగా, దీన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తుండటం గమనార్హం.

‘శరభ’ ఫేమ్, గతంలో శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌ నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.  మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. గతేడాది సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఇంటెలిజెంట్‌’ తరువాత వినాయక్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదన్న సంగతి తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here