స్మార్ట్ ఫోన్ పోయిందని.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య!

0
61

  • తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘటన
  • ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొన్న అశోక్
  • అది పోవడంతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం

స్మార్ట్ ఫోన్ పోవడంతో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఖరీదైన ఫోన్ పోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీలో అశోక్(17) అనే యువకుడు తల్లి జయమ్మతో కలసి ఉంటున్నాడు. ఇద్దరూ కూలి పనులకు వెళ్లేవారు.

ఇటీవల దాచుకున్న డబ్బులతో అశోక్ ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను కొన్నాడు. అయితే దాన్ని పొగొట్టుకున్నాడు. దీంతో తీవ్రమనస్తాపానికి లోనైన అశోక్, కుడిచేతిని బ్లేడుతో కోసుకున్నాడు. వెంటనే తల్లి, ఇరుగుపొరుగువారు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న అశోక్ తల్లి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో అశోక్ తల్లి జయమ్మను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here