కమలహాసన్ పై చెప్పులతో దాడి!

0
44

  • రెండు రోజుల క్రితం హిందూ ఉగ్రవాదంపై వ్యాఖ్యలు
  • చెప్పులు విసిరిన హనుమసేన, బీజేపీ కార్యకర్తలు
  • రక్షణగా నిలిచిన పోలీసులు

విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమలహాసన్‌ పై చెప్పులతో దాడి జరిగింది. స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలో కమల్ పాల్గొన్న వేళ, ఓ వ్యక్తి ఆయనపైకి ఓ చెప్పును విసిరాడు. అయితే, అది ఆయన పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనను చూసిన మరికొందరు సైతం కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. వారిని ముందుగానే గుర్తించిన పోలీసులు, కమల్ చుట్టూ రక్షణగా నిలబడి, వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై కొందరు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపైనా కేసు నమోదైంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here