‘పటాస్’ షో నుంచి శ్రీముఖి అందుకే తప్పుకుందట

0
124

  • పటాస్’తో పాప్యులర్ అయిన శ్రీముఖి
  • కొన్నాళ్ల పాటు ‘పటాస్’ కి దూరం
  •  ‘బిగ్ బాస్ 3’ లో అవకాశం వచ్చిందంటూ టాక్

బుల్లితెరకి మరింత గ్లామర్ తీసుకొచ్చిన యాంకర్స్ లో శ్రీముఖి కూడా చేరిపోయింది. బుల్లితెరపై ఆమె చేసే అల్లరి యూత్ కి విపరీతంగా నచ్చేసింది. నాన్ స్టాప్ గా సందడి చేస్తూ ‘పటాస్’ షోను ఒక రేంజ్ కి తీసుకెళ్లింది. శ్రీముఖి కోసమే ఈ షో చూసేవాళ్లు వున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంటున్నట్టుగా చెప్పడం యూత్ ను నిరాశ పరిచింది.

ఆమె ఇలా హఠాత్తుగా బ్రేక్ తీసుకోవడానికి కారణమేమై ఉంటుందా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ‘బిగ్ బాస్ 3’ సీజన్ లో పాల్గొనే అవకాశం శ్రీముఖికి వచ్చిందట. ఆ షోలో పాల్గొనడం కోసమే ఆమె బ్రేక్ తీసుకుందనేది తాజా సమాచారం. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ షో, జూలై రెండవ వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఇక శ్రీముఖి అల్లరి బిగ్ బాస్ హౌస్ లో చూడొచ్చన్న మాట.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here