ఐఆర్‌సీటీసీ సేవలకు ఈరోజు రాత్రి ఐదు గంటలపాటు బ్రేక్‌

0
110

  • అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారు జాము వరకు సర్వీస్‌లు నిలిపివేత
  • నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా అంతరాయం
  • వినియోగదారులు గమనించాలని నిర్వాహకుల వినతి

రైల్వే సంబంధిత సర్వీసులను ఆన్‌లైన్‌లో అందించే ఐఆర్‌సీటీసీ సేవలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి దాదాపు ఐదు గంటలపాటు నిలిపి వేస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతోందని ప్రకటించారు. రాత్రి 11.45 గంటల నుంచి త్లెవారు జామున 5 గంటల వరకు సర్వీస్‌లు అందుబాటులో ఉండవని, అత్యవసర ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ముందుగానే తమ అవసరాలను పూర్తి చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ కోరింది. మరింత సమాచారం కోసం 0755-6610661, 0755-4090600, 0755-3934141 కస‍్టమర్‌ కేర్‌  నంబర్లు లేదా eticket@irctc.co.in మెయిల్‌ ఐడీని  సంప్రదింవచ్చని సూచించింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here