సాధ్వి ప్రజ్ఞా సింగ్ పై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

0
58

  • గాంధీని చంపినవారిని ప్రజలు ఉగ్రవాదిగానే భావిస్తారు
  • వారిని దేశభక్తులుగా చూసేవారు కూడా ఉగ్రవాదులే
  • గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్విపై సిద్ధరామయ్య ఘాటు విమర్శలు

బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వి ముమ్మాటికీ ఉగ్రవాదేనని ఆయన అన్నారు. గాంధీని చంపినవారిని దేశ ప్రజలంతా ఉగ్రవాదిగానే భావిస్తారని, వారిని దేశభక్తులుగా చూసే వారు కూడా ఉగ్రవాదులేనని చెప్పారు.

స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువే అంటూ ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వి మరో వివాదానికి తెరతీశారు. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్ కావడంతో, ఆమె క్షమాపణలు చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here