150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ‘మహర్షి’

0
115

  • ఈ నెల 9వ తేదీన విడుదలైన ‘మహర్షి’
  • ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం
  •  200 కోట్ల క్లబ్ దిశగా పరుగులు

మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ‘మహర్షి’ ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రైతుల సమస్యలకి సంబంధించిన కథ కావడంతో, సాధారణ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమా 4  రోజుల్లోనే 102.45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

8 రోజుల్లో ఈ సినిమా 150.45 కోట్లను రాబట్టిందనేది తాజా సమాచారం. ఈ ఏడాది వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా ఫుల్ రన్లో 127.20 కోట్లను వసూలు చేసింది. కేవలం 8 రోజుల్లోనే ఆ వసూళ్లను ‘మహర్షి’ అధిగమించి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా కొత్త రికార్డును నమోదు చేసింది. ‘భరత్ అనే నేను’తో 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన మహేశ్ బాబు, ‘మహర్షి’ని కూడా ఆ క్లబ్ లోకి చేరుస్తాడేమో చూడాలి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here