ఆస్ట్రేలియాలో 56 ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి: ఒమర్ అబ్దుల్లా

0
73

  • అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు కావు
  • నిజాన్ని బయటకు చెప్పుకోవడానికి భారత ప్రజలు భయపడతారు
  • ఫలితాల కోసం 23 వరకు వేచి చూడాల్సిందే

ఎన్డీయే సంపూర్ణ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన వేళ… పలువురు విపక్ష నేతలు ఎగ్జిట్ పోల్స్ పై పెదవి విరుస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ నమ్మదగినవి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా ఎగ్జిట్ పోల్స్ పై ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు అవుతాయని నేను భావించడం లేదు. గత వారం ఆస్ట్రేలియాలో 56 వివిధ ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి. భారత్ లో చాలా మంది ప్రజలు భయంతో తమ అంతరంగాన్ని సర్వేలు చేసే వారితో చెప్పుకోరు. తాము ఎవరికి ఓటు వేయబోతున్నామో, ఎవరికి వేశామో అనే నిజాన్ని చెప్పడానికి భయపడతారు. దీంతో, ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి. ఈ నేపథ్యంలో, ఫలితాల కోసం మే 23 వరకు వేచి చూడక తప్పదు’ అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here