ఇకపై అలాంటి పాత్రలు చేయను: హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్

0
92

  • తమిళంలో వరుస సినిమాలు
  • త్వరలో తెలుగు తెరకి పరిచయం
  •  మొహమాటాలకు వెళ్లనంటున్న ఐశ్వర్య రాజేశ్

తమిళంలో వరుస అవకాశాలతో ఐశ్వర్య రాజేశ్ దూసుకుపోతోంది. ఈ ఐశ్వర్య రాజేశ్ ఎవరో కాదు .. ఒకప్పుడు తెలుగులో ‘మల్లెమొగ్గలు’తో హీరోగా పరిచయమైన రాజేశ్ కూతురు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయనున్న సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ, ఇంతకుముందు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలను కొన్ని మొహమాటాల కారణంగా చేయవలసి వచ్చింది. అలాంటి పాత్రల వలన నాకు ఎంతమాత్రం గుర్తింపు రాలేదు. ఆ తరహా పాత్రల్లో ‘సామీ స్క్వేర్’ ఒకటి. ఆ సినిమాలో రెండో కథానాయికగా ఎంత మాత్రం  ప్రాధాన్యత లేని పాత్ర చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఇకపై ఎలాంటి మొహమాటాలకు వెళ్లదలచుకోలేదు .. అలాంటి పాత్రలను చేయదలచుకోలేదు” అని చెప్పుకొచ్చింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here