తెలుగు రాష్ట్రాల్లో ‘మహర్షి’ 10 రోజుల వసూళ్లు

0
73

  • మహేశ్ 25వ సినిమాగా ‘మహర్షి’
  • నైజామ్ వసూళ్లు 23.50 కోట్లు
  •  200 కోట్ల క్లబ్ దిశగా పరుగులు

మహేశ్ బాబు 25వ సినిమాగా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు ‘మహర్షి’ వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలలో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ 10 రోజుల్లో ఈ సినిమా 64.82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 23.50 కోట్లు వసూలు చేయడం విశేషం.

మహేశ్ బాబు కెరియర్లోను .. ఈ ఏడాదిలో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని అంటున్నారు. దగ్గరలో చెప్పుకోదగిన పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం .. వేసవి సెలవులు కావడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. అందువలన ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకోవడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమాలో కథానాయిక పూజా హెగ్డే అనే విషయం తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here