ప్రమాణ స్వీకారానికి ముందు తండ్రి ఆశీస్సులు.. రేపు పులివెందులకు జగన్

0
54

  • రేపు ఉదయం ప్రత్యేక విమానంలో కడప చేరుకోనున్న జగన్
  •  ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళులు
  • చర్చిలో ప్రార్థనలు

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు తీసుకోవాలని నిర్ణయించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఇడుపులపాయ వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుని తండ్రికి నివాళులు అర్పిస్తారు. అనంతరం గండికి వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి పులివెందుల చేరుకుని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కడపలోని పెద్ద దర్గాను సందర్శించిన అనంతరం తిరిగి విజయవాడ చేరుకుంటారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here