సెన్సెక్స్‌ దూకుడు…దేశీయ మార్కెట్ల లాభాల పరుగు

0
31

  • 40 వేలు మార్కు దాటిన పాయింట్లు
  • ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 150 పాయింట్ల లాభం
  • 12 వేలు పైన ట్రేడవుతున్న నిప్టీ

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం, కొత్త మంత్రివర్గం కొలువు దీరడంతో దేశీయ మార్కెట్‌ మంచి జోష్‌తో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నుంచి సెన్సెక్స్‌ మంచి ఊపుమీద ట్రేడవుతోంది. 150 పాయింట్ల లాభంతో ప్రారంభమైన ట్రేడింగ్‌ ఆ తర్వాత కూడా లాభాలు పరుగుతో కొనసాగుతోంది. లోహ, ఫార్మా, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగా షేర్లు కొనుగోళ్ల కళతో జూన్‌ డెరివేటివ్‌ సీరియస్‌ను సూచీలు రికార్డు స్థాయిలో ఉత్సాహంగా ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 40 వేల మార్కును దాటేయగా నిప్టీ కూడా 12 వేలు పైన కొనసాగుతోంది. ఉదయం 11.15 గంటల సమయానికి సెన్సెక్స్‌ 237 పాయింట్ల లాభంతో 40,068 పాయింట్లతోను, నిప్టీ 75 పాయింట్ల లాభంతో 12,021వద్ద ట్రేడవుతోంది. ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ఇండియా, హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండిగో, టాటాస్టీల్‌ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.75గా కొనసాగుతోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here