కోహ్లీ ఇంకా ఎదగలేదన్న రబాడా… సరైన సమాధానాన్ని ఇచ్చే తీరుతానంటున్న కోహ్లీ!

0
76

  • కోహ్లీ అపరిపక్వుడన్న రబాడా
  • మైదానంలోనే సమాధానం ఇస్తా
  • మీడియాతో కోహ్లీ
  • నేడు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య పోరు

మరికాసేపట్లో వరల్డ్ కప్ సంగ్రామంలో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాలు ఆసక్తికర సమరానికి సిద్ధమవుతున్న వేళ, ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఇటీవల రబాడా మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ ఇంకా ఎదగలేదని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ పోటీలను గుర్తు చేసుకున్న రబాడా, తన బౌలింగ్ లో ఫోర్ కొట్టిన కోహ్లీ ఏదో అన్నాడని, ఆపై తాను అవుట్ చేయగా, కోపాన్ని ప్రదర్శించాడని అన్నాడు. కోహ్లీ తనకు అర్థం కావడం లేదని, ఆయనలోని అపరిపక్వతే ఇందుకు కారణం కావచ్చని చెప్పాడు.

ఇక తాజాగా, నేటి మ్యాచ్ కి ముందు విరాట్ కోహ్లీ మీడియా ముందుకు రాగా, రబాడా వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. రబాడా వ్యాఖ్యలపై కోహ్లీ స్పందిస్తూ, తాను రబాడాతో చాలాసార్లు ఆడానని, ఆయన అన్న మాటలకు మైదానంలోనే సరైన సమాధానం చెబుతానని అన్నాడు. ఇదిలావుండగా, నేటి మ్యాచ్ లో భుజం గాయం కారణంగా డేల్ స్టెయిన్ బరిలోకి దిగడంలేదు. గాయపడిన ఎంగిడి కూడా లేకుండానే సౌతాఫ్రికా బరిలోకి దిగుతోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here