యువతిపై ప్రియుడి లైంగిక దాడి, సహకరించిన తల్లి!

0
66

  • హైదరాబాద్ లో ఘటన
  • ప్రేమ, పెళ్లి పేరిట యువతిని లోబరచుకున్న నిందితుడు
  • పెళ్లి మాటెత్తగానే నిరాకరణ
  • రిమాండ్ కు పంపిన పోలీసులు

ప్రేమ, పెళ్లి పేరు చెప్పి, ఓ యువతిని ఇంటికి తీసుకొచ్చిన కొడుకు, అత్యాచారానికి పాల్పడుతుంటే, కొడుకును మందలించాల్సిన తల్లి సహకరించిన కేసును హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కేసు తమ దృష్టికి రాగానే స్పందించి ఇద్దరినీ రిమాండ్ కు పంపారు.

మల్లాపూర్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కాప్రాకు చెందిన ఓ యువతి (18), జూనియర్ కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పని చేస్తుండగా, నాచారానికి చెందిన అబ్దుల్ మజీద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారగా, పలుమార్లు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లిన మజీద్ శారీరక వాంఛలను తీర్చుకున్నాడు. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు.

తర్వాత పెళ్లి చేసుకోవాలని బాధితురాలు నిలదీయగా, నిరాకరిస్తూ, తన వద్ద వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. ఆమె వద్ద నుంచి రూ. 60 వేల నగదును, ఏడున్నర గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడు. ఇందుకు అతని తల్లి సలేహా సహీన్ తనవంతు సహకారాన్ని అందించింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, వారి నుంచి బంగారంతో పాటు బైక్, కారు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here