రైల్వేకోడూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దారుణహత్య…రంజాన్‌కు ఇంటికి వస్తుండగా ఘటన

0
67

  • బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మృతుడు
  • పండుగ నేపథ్యంలో తల్లిదండ్రుల వద్దకు రాక
  • బస్సు దిగి నడిచి వెళ్తుండగా కత్తులతో నరికి చంపిన దుండగులు

రంజాన్‌ సెలవులకు స్వగ్రామం వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు బస్టాండ్‌ సమీపంలో ఈరోజు తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రైల్వేకోడూరు రంగనాయకులపేటకు చెందిన  సాబ్‌జాన్‌ కుమారుడు షేక్‌అబ్దుల్‌ఖాదర్‌ (26) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

రంజాన్‌ పండుగ కావడంతో కుటుంబ సభ్యుల వద్దకు బస్సులో బయలుదేరారు. తెల్లవారు జామున రైల్వేకోడూరు బస్టాప్ లో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. శ్రీకృష్ణ సినిమా హాల్‌ వద్దకు వచ్చేసరికి దుండగులు అతనిపై దాడిచేసి హత్య చేశారు. ఖాదర్‌కు ఈనెల 23నే వివాహ నిశ్చయమైంది. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here