దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భారతీయులు మృతి

0
69

  • ప్రాణాలు కోల్పోయిన మరో 9 మంది విదేశీయులు
  • బస్సు అదుపు తప్పడంతో దుర్ఘటన
  • సంఘటన సమయానికి బస్సులో 31 మంది ప్రయాణికులు

దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులు సహా మొత్తం 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఒమన్‌ నుంచి దుబాయ్‌కి 31 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్‌ వద్ద అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భారత్‌ ఎంబసీ, దుబాయ్‌ పోలీసుల కథనం మేరకు…ప్రయాణికులతో వస్తున్న బస్సు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దాటిన అనంతరం సైన్‌ బోర్డును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్సు అతివేగం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

చనిపోయిన వారిలో భారత్‌కు చెందిన రాజగోపాలన్‌, ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, రేష్మ ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, దీపక్‌ కుమార్‌, జమాలుద్దీన్‌ అరక్కవీటిల్‌, కిరణ్ జానీ, వాసుదేవ్‌, తిలక్‌రామ్‌ జవహార్‌ ఠాకూర్‌  ఉన్నారని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రమాదంలో మరికొందరు భారతీయులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని భారత్‌ ఎంబసీ తెలిపింది

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here