లండన్‌లో భారత హైకమిషనర్ ఇంట్లో కోహ్లీ సేన సందడి

0
63

  • భారత హై కమిషనర్ రుచి ఘనశ్యామ్ ఇంటిని సందర్శించిన టీమిండియా
  • ఫొటోలు షేర్ చేసిన బీసీసీఐ
  • ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌కు రెడీ అవుతున్న భారతజట్టు శుక్రవారం లండన్‌లోని భారత హైకమిషనర్ ఇంటిని సందర్శించింది. హైకమిషనర్ రుచి ఘనశ్యామ్‌తో ఆటగాళ్లు ముచ్చటిస్తున్న ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

మూడు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు ఆదివారం పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. శుక్రవారం వర్షం కారణంగా ప్రాక్టీస్ సెషన్ రద్దు కావడంతో నేడు పూర్తిగా ప్రాక్టీస్‌కే పరిమితం కానుంది. కాగా, వర్షం కారణంగా నిన్న పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here