మమతా బెనర్జీని రెచ్చగొడుతున్న బీజేపీ శ్రేణుల తీరు సరికాదు : మండిపడిన శత్రుఘ్న సిన్హా

0
67

  • ఆమె ఆడపులి అన్న విషయం మర్చిపోవద్దు
  • ఈ డ్రామాలు, పోస్టు కార్డు యుద్ధాలు ఆపండి
  • మతం పేరుతో రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న బీజేపీ శ్రేణుల తీరును ప్రముఖ సినీనటుడు, కాంగ్రెస్‌ నాయకుడు శత్రుఘ్న సిన్హా తప్పుపట్టారు. ఆమె ఆడ పులి అని, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు బెదరదని అన్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు దీదీ కారును అడ్డుకున్నారు. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఆ సందర్భంలో ఆమె కారు దిగి ఆందోళన కారులను హెచ్చరించారు. అప్పటి నుంచి బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో  శత్రుఘ్న సిన్హా మమతకు మద్దతుగా వరుస ట్వీట్లు చేశారు. బీజేపీ శ్రేణులు మతం పేరుతో రాజకీయాలు చేయడం తగదని, పోస్టు కార్డు డ్రామాలకు తెరదించాలని కోరారు. ఈతరం అభివృద్ధిని కోరుకుంటోంది తప్ప మతాన్ని కాదన్నారు. ఓ మహిళా నేత పట్ల అగౌరవంగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here