మళ్లీ ఇంతకాలానికి వెంకీ సరసన టబూ

0
69

  • హిందీలో హిట్ కొట్టిన ‘దే దే ప్యార్ దే’
  • త్వరలో తెలుగులోకి రీమేక్
  • సెట్స్ పైకి తీసుకెళ్లేదిశగా సన్నాహాలు

మొదటి నుంచి కూడా వెంకటేశ్ రీమేక్ ల పట్ల ఆసక్తిని కనబరుస్తూనే వచ్చారు. అలా ఆయన సక్సెస్ లలో రీమేక్ చిత్రాలు చాలానే కనిపిస్తాయి. తాజాగా ఆయన మరో రీమేక్ చిత్రం చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల హిందీలో విడుదలైన ‘దే దే ప్యార్ దే’ చిత్రం అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగణ్ .. రకుల్ .. టబూ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా నిర్మితమైంది.

పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబూ చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారనేది తాజా సమాచారం. 28 ఏళ్ల క్రితం ‘కూలీ నెం 1’ సినిమాలో వెంకీ జోడీ కట్టిన టాబూ, మళ్లీ ఇంతకాలానికి ఆయన సరసన కనిపించనుందన్న మాట. ఇక హిందీలో రకుల్ చేసిన పాత్రకి తెలుగులోను ఆమెనే తీసుకుంటారో .. మరొకరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here