మీడియాను పిలిచిన క్రికెటర్ యువరాజ్ సింగ్… ఏం చెబుతారోనని ఉత్కంఠ!

0
73

  • ఒకప్పుడు జట్టులో స్టార్ బ్యాట్స్ మెన్
  • క్యాన్సర్ సోకిన తరువాత జట్టుకు దూరం
  • రిటైర్ మెంట్ పై మాట్లాడే అవకాశం

ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో స్టార్ బ్యాట్స్ మెన్ గా తనదైన ముద్రవేసి, ప్రస్తుతం ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన యువరాజ్ సింగ్, నేడు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానాలు అందాయి. ఈ సమావేశంలో యువరాజ్ సింగ్ ఏం చెప్పబోతున్నారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. కాగా, కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ కు దూరమై, చికిత్స పొందిన తరువాత, యువరాజ్ క్రికెట్ లోనూ సత్తా చాటారు. ఇటీవలి ఐపీఎల్ పోటీల్లోనూ కొన్ని మ్యాచ్ లు ఆడారు. ఇకపై భారత జట్టులో స్థానం లభించే అవకాశాలు లేకపోవడంతో, ఆయన తన రిటైర్ మెంట్ పై ప్రకటన చేయవచ్చని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here