ఒడిశాలో దారుణం.. పాత కక్షలతో తలను నరికి పట్టుకెళ్లిన దుండగులు!

0
55

  • ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో ఘటన
  • ఆరు బయట నిద్రపోతుండగా దుశ్చర్య
  • మృతుడిని సత్యనారాయణగా గుర్తించిన పోలీసులు

ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని బాలుపల్లి గ్రామంలో సత్యనారాయణ(40) అనే వ్యక్తి ఇంటి బయట నిద్రపోయాడు. అయితే గుర్తుతెలియని దుండగులు ఆయన తలను నరికేశారు. అనంతరం దాన్ని పట్టుకెళ్లారు.

ఉదయాన్నే ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటుచేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here