ప్రభాస్ ఇంటిముందు జపాన్ యువతుల డ్యాన్స్!

0
52

  • జపాన్ లోనూ ప్రభాస్ కు అభిమానులు
  • అక్కడి నుంచి ఇండియాకు వచ్చిన అమ్మాయిలు
  • ప్రభాస్ కలవకపోవడంతో ఇంటి ముందు నృత్యాలు

“బాహుబ‌లి” సినిమా జపాన్ లో విడుదలై సూపర్ హిట్ అయిన తరువాత, ఆ దేశంలో ప్రభాస్ కు ఎంతో మంది యువ అభిమానులు ఏర్పడ్డారు. అందులోనూ అమ్మాయిల సంఖ్యే అధికం. ఆ సినిమా విడుదల సమయంలో ప్రభాస్, అనుష్కలు జపాన్ కు కూడా వెళ్లి వచ్చారు.

ఇదిలావుండగా, ఇటీవల కొందరు జపాన్ కు చెందిన యువతులు ఇండియాకు వచ్చారు. వారంతా ప్రభాస్ పై ఉన్న అభిమానంతో, ఆయన్ను కలుసుకునేందుకు హైదరాబాద్ లోని ప్రభాస్ ఇంటికి వెళ్లారు. అయితే, ‘సాహో’ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా ప్రభాస్ వారిని కలుసుకోలేకపోయారు. అయితేనేం, తమ అభిమానాన్ని చూపుతూ వారంతా ప్రభాస్ ఇంటి గేటు ముందు నృత్యాలు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here