‘బిగ్ బాస్ 3’కి నో చెప్పిన బండ్ల గణేశ్

0
54

  • బిగ్ బాస్ 3’కి సన్నాహాలు
  • తన ఇబ్బంది చెప్పిన బండ్ల గణేశ్
  •  హీరో వేణుతోను సంప్రదింపులు

కొంతకాలం క్రితం వరకూ స్టార్ హీరోలతో భారీ సినిమాలను నిర్మించిన బండ్ల గణేశ్, ఆ తరువాత కొన్ని కారణాల వలన సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. మళ్లీ తాను సినిమాల నిర్మాణం చేపట్టాలనుకుంటున్నట్టు ఇటీవలే ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలుగు ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులు ఆయనను సంప్రదించారట.

తమ షోలో పాల్గొనమని కోరుతూ, ఆ షో గురించి పూర్తి వివరాలను చెప్పారట. అయితే ఫోన్ అందుబాటులో లేకుండా అన్నేసి రోజులు ఉండటం తన వలన కాదంటూ ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఇక ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులు, సీనియర్ హీరో ‘తొట్టెంపూడి వేణు’ను కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఏమన్నాడో తెలియాల్సి వుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here