కల్యాణ్ రామ్ కొత్త సినిమాకి రంగం సిద్ధం

0
68

  • ‘సెట్స్ పై ‘తుగ్లక్’ మూవీ
  • తదుపరి సినిమా సతీశ్ వేగేశ్నతో
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్

ప్రస్తుతం కల్యాణ్ రామ్ కథానాయకుడిగా మల్లిడి వేణు దర్శకత్వంలో ‘తుగ్లక్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత కల్యాణ్ రామ్ .. సతీశ్ వేగేశ్న తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది.

తాజాగా ఈ ప్రాజెక్టు ఖాయమైనట్టుగా ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ వారు తొలిసారిగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. గోపీసుందర్ సంగీత దర్శకుడిగా చేస్తోన్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. సతీశ్ వేగేశ్న నుంచి గతంలో వచ్చిన చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం విశేషం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here