కాల్పులతో దద్దరిల్లిన పుల్వామా

0
54

  • అవంతిపొరా ప్రాంతంలో ఎదురుకాల్పులు
  • ఇద్దరు ఉగ్రవాదుల హతం
  • ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో తుపాకులు గర్జించాయి. జిల్లాలోని అవంతిపొరా పరిధిలో ఉన్న బ్రాబందిన ప్రాంతంలో ఈరోజు జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గాలింపు చేపట్టారు. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులను జవాన్లు కాల్చి చంపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన టెర్రరిస్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here